ధరణి పోర్టల్‌తో అవస్థలు పడుతున్న రైతులు
ABN , First Publish Date - 2022-12-27T23:23:24+05:30 IST
ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
- ఆందోళనలో బీజేపీ నాయకులు
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), డిసెంబరు 27 : ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అధ్య క్షతన మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా హాజరైన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డిలు మాట్లాడుతూ ధరణి పోర్టల్ వైఫల్యాలతో రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని. లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు తక్షణమే రుణా లను మాఫీ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బూటకపు మాటలతో రైతులను మభ్యపెడుతోం దని వారు మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని 2018లోనే సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారని, అది ఏమైందని ప్రశ్నించారు. అనంతరం వారు నూతన కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని రెవెన్యూ అదనపు కలెక్ట ర్ కె. సీతారామారావు కు వినతిపత్రం సమర్పిం చారు. కార్యక్రమంలో నాయకలు బురుజు రాజేందర్ రెడ్డి, ఎగ్గని నర్సిములు, పాండురంగా రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్, పి. శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, రవీందర్‌రెడ్డి, పి. సత్యం, సుదర్శన్‌రెడ్డి, వివిధ మోర్చాల నాయకులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
రైతులకు ఏకకాలంలో రూణమాఫీ కావాలి
భూత్పూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కు ఏక కాలంలో రూణ మాఫీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేప ట్టిన ధర్నా కార్యక్రమానికి భూత్పూర్ నుంచి పార్టీ ముఖ్యనాయకులు మోటారు సైకిల్‌పై ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాపురం రవీందర్ స్థానిక విలేకరు లతో మాట్లాడారు. ఓట్ల సమయంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారం లోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెను ఎక్కాక ఆ మాటను మర్చిపోయిందని అన్నారు. ఈ కార్య క్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొడు గు ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, నాయకులు సదా నందు, శ్రీనివాసులు, ఎం.డీ. ఫారుక్, రాంరెడ్డి, నరేష్‌చారి, రాము, చెన్నయ్య పాల్గొన్నారు.