బీచుపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-11-12T22:46:01+05:30 IST

మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శ్రీ ఆం జనే యస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస మూడో శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం నదిమ తల్లికి పూజలు చేశారు.

బీచుపల్లి ఆలయంలో  ప్రత్యేక పూజలు
బీచుపల్లిలో కార్తీకదీపారాధన చేస్తున్న భక్తులు

ఇటిక్యాల, నవంబరు 12 : మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శ్రీ ఆం జనే యస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస మూడో శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం నదిమ తల్లికి పూజలు చేశారు. నదితీరాన కార్తీక దీపారాధన చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆంజనే యస్వామి, కోదండరామాలయం, శివాలయం , సరస్వతిదేవి ఆలయాల వద్ద మహిళలు కార్తీక దీపారాధన చేశారు.

ఆదిశిలా క్షేత్రంలో..

మల్దకల్‌ : ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస మూడో శనివారం మహిళలు, భక్తులు కార్తీక దీపారాధన నిర్వహిం చారు. ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యశ్చంద్రారెడ్డిల ఆధ్వర్యంలో భక్తు ల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేయగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరై కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-11-12T22:46:05+05:30 IST