ఐక్యత దేశానికి ప్రతీక

ABN , First Publish Date - 2022-11-29T23:27:31+05:30 IST

పరస్పర సౌభాతృత్వం మత పరమైన ఐక్యత భారతదేశానికి ప్రతీకలని సర్వమత మహాసభలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఐక్యత దేశానికి ప్రతీక
విద్యార్థులకు బట్టలు పంపిణీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

- సర్వమత సదస్సులో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

నారాయణపేట, నవంబరు 29 : పరస్పర సౌభాతృత్వం మత పరమైన ఐక్యత భారతదేశానికి ప్రతీకలని సర్వమత మహాసభలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నారాయణపేట మండలం కొల్లంపల్లిలో హజరత్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖతాల్‌ హుస్సెని దర్గా 548 ఉర్సు సందర్భంగా అఖిల భారత సర్వమత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్నమతాల ప్రజలు సోదరభావం, ఐక్యతతో జీవించడం భారతదేశ ఐక్యతను చాటుతోందన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా హిందూ, ముస్లింల ఐక్యత పెంపొందుతుందన్నారు. మదర్సా దారుర్‌ ఉలుం ఆష్రఫియా కొల్లంపల్లి విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సభకు మహ్మద్‌ హుస్సెని సజ్జద, నషీన్‌ గోరి షరీఫ్‌, సయ్యద్‌ షా జలాల్‌ హుస్సెని, అష్రఫి జలాలి సజ్జదా, నషీం ఖర్గా కతాలియ, ఆర్థిక సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌, తెలంగాణ మౌలానా సయ్యద్‌ ముస్తఫా ఖాద్రి, అబ్దుల్‌ రజాక్‌ ఖాద్రి, సయ్యద్‌ జలాల్‌ హుస్సెన్‌, ఆర్టీవో వీరస్వామి, మైనార్టీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి గోవింద్‌ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు అబ్దుల్‌ సలీం, అమీరుద్దిన్‌, మహమ్మద్‌ షఫీ చాంద్‌, నాయకులు తాజుద్దీన్‌, సర్ఫరాజ్‌, ఫజల్‌, సయ్యద్‌ పాషా పాల్గొన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు..

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొల్లంపల్లికి చెందిన సిద్ది సాయమ్మకు బొలెరో వాహనం, బోయిన్‌పల్లి బాల నర్సిములుకు ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు వి.రాములు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు

నారాయణపేట టౌన్‌ : నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునిసిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కల్లు గీత కార్మికులు భీంచందర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ ఎంఎఫ్‌సీ చైర్మన్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, ఇతర పార్టీలకు తెలంగాణాలో తావు లేదన్నారు.

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

నారాయణపేట, నవంబరు 29 : అభివృద్ధి పనులను త్వరితగ తిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ పుర అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట పుర కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి కమిషనర్‌ సునిత, ఇం జనీయర్‌ మహేష్‌, అధికారులతో పట్టణంలో జరుగుతున్న అభి వృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం చైర్‌పర్సన్‌ గందె అన సూయతో పాటు పుర అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా ఆసుపత్రి వద్ద స్ర్ట్రీట్‌ వెండర్‌ జోన్‌, డంపింగ్‌ యార్డును, డీఆర్‌సీసీ సెంటర్‌ను పరిశీలించి తడి, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. 13వ వార్డులో కొన సాగుతున్న కమ్యూ నిటీ హాల్‌ పనులు, సివిల్‌ లైన్‌లోని సీనియర్‌ సీటిజన్‌ పార్కును పరిశీలించారు. కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాజు, ఇన్‌చార్జి శానిటరి ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, చెన్నకేశవులు, శ్రీధర్‌, ఎన్‌రాల్‌మెంట్‌ ఇంజనీయర్‌ భరత్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-29T23:27:34+05:30 IST