Moinabad Farmhouse: ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం..!

ABN , First Publish Date - 2022-10-27T19:14:28+05:30 IST

టీఆర్‌ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ (Delhi)కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ (BJP) తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Moinabad Farmhouse: ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం..!

హైదరాబాద్: టీఆర్‌ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ (Delhi)కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ (BJP) తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్‌లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్‌కు తెర లేపిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీకి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను రాష్ట్ర పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే.. పక్కాగా వల పన్ని, మొత్తం బేరసారాలనూ దాదాపు గంటన్నరపాటు ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసి మరీ ఆధారాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నిక (Munugode by election)లకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో పెనుప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - 2022-10-27T19:42:45+05:30 IST