పిల్లల్లో పోషణ లోపం లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2022-11-30T23:34:23+05:30 IST
అదనపు కలెక్టర్ ప్రతిమాసిం
మెదక్ అర్బన్, నవంబరు 30: పిల్లల్లో పోషణ లోపం లేకుండా పర్యవేక్షిస్తూ.. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా లభించే అన్ని రకాల సేవలు వారికి అందించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లకు రెండు రోజుల పాటు మెదక్‌లో శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమాసింగ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యవేక్షణ జాబితాను ఎప్పటికప్పుడు పూరించి, పారదర్శకత పాటించాలన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన శిబిరంలో బిడ్డ పెరుగుదల ఎలా చూడాలి, నవజాత శిశువుల సంరక్షణ, బలహీనమైన శిశువులను గుర్తించడం, తీవ్ర లోల పోషణ గుర్తించడం, నివారించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీడబ్ల్యూ బ్రహ్మాజీ పాల్గొన్నారు.
పనులను వేగవంతం చేయాలి
పెద్దశంకరంపేట: చీలపల్లి, జంబికుంట, ఉత్తులూరు గ్రామాల్లో మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో పనులను, పెద్దశంకరంపేటలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పనులను, మోడల్ స్కూల్‌లో విద్యాబోధనను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పలు గ్రామాల్లో పనులు నత్తనడకన నడుస్తుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెవెంట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీడీవో రఫికున్నిసాబేగం, ఎంపీటీసీ వీణసుభా్‌షగౌడ్, నాయకులు అంజయ్య, శంకర్‌గౌడ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విఠల్‌నాయక్, రామచంద్రచారి, వెంకటేశం, రాములు, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.