తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ
ABN , First Publish Date - 2022-12-28T23:09:31+05:30 IST
డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
మెదక్/జిన్నారం/నారాయణఖేడ్/వెల్దుర్తి, డిసెంబరు 28: తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందన్నారు. దేశంలో నేడు నియంత పాలన సాగుతుందని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలక్రిష్ణ, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంతప్ప, ఆవుల భాగ్యలక్ష్మీ, గూడూరి ఆంజనేయులు, రమే్‌షరెడ్డి, రాజలింగం, శ్రీనివాస్, శ్యాంరెడ్డి, పల్లె రాంచందర్, శ్యాంసుందర్, ప్రేమ్‌కుమార్, భూపతియాదవ్ పాల్గొన్నారు. బొల్లారంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యరెడ్డి కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. నారాయణఖేడ్‌లో నిర్వహించిన వేడుకల్లో మహాత్మగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుడు బోజిరెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దారంశంకర్, అశోక్‌రెడ్డి, పండరిరెడ్డి, మాజీ సర్పంచు ఈశ్వరప్ప, మాజీ ఉప సర్పంచు భూమయ్య, నాయకులు నర్సింలు, శంకర్ ముదిరాజ్, రాజుసేట్, హన్మండ్లు, నారాయణ పాల్గొన్నారు. వెల్దుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, పార్టీ మత్స్య విభాగం రాష్ట్ర కార్యదర్శి తలారి మల్లేశం, నాయకులు మహే్‌షరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌గౌడ్, హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.