సిద్దిపేట కలెక్టరేట్‌లో కనులపండువగా..
ABN , First Publish Date - 2022-10-01T04:54:15+05:30 IST
జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ముజామిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ ఆడి సందడి చేశారు.
బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా ఉద్యోగులు, సిబ్బంది
సిద్దిపేట అగ్రికల్చర్, సెప్టెంబరు 30 : జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ముజామిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ ఆడి సందడి చేశారు. పలువురి మహిళల గిరిజన సంప్రదాయ వేషధారణ ఆకట్టుకున్నది. వేడుకలలో జిల్లా పశుసంవర్ధకశాఖ మొదటి బహుమతి పొందింది. తరువాత వరుసగా టీఎన్జీవో, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా శాఖలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని, ఈ పండుగ తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో రెహమాన్, సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత, డీపీవో దేవకీదేవి, సీపీవో అశోక్, డీపీఆర్వో రవికుమార్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
