పటాన్‌చెరులో ఘనంగా ఛాట్‌పూజ
ABN , First Publish Date - 2022-11-01T00:00:56+05:30 IST
పటాన్‌చెరు సాకి చెరువు కట్టపై సోమవారం ఛాట్‌పూజా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.
పటాన్‌చెరు, అక్టోబరు 31: పటాన్‌చెరు సాకి చెరువు కట్టపై సోమవారం ఛాట్‌పూజా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఛాట్‌పర్వదినాన్ని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉత్తరాది ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుడిని ఆరాధించే ఛాట్ పూజ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. మినీ ఇండియాగా భావించే పటాన్‌చెరులో అన్ని వర్గాలకు అండగా ఉంటామన్నారు. అర్హులైన ఉత్తరాది ప్రజలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఛాట్‌పూజ పండగ వరకు సాకి చెరువు కట్టపై సూర్యదేవాలయాన్ని నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టుకుమార్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు అఫ్జల్, ఉత్తరాది సంక్షేమ సంఘం నాయకులు సందీ్‌పషా, సంజయ్‌సింగ్, జైకిషన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఛాట్‌పూజ ఉత్సవం సందర్భంగా పటాన్‌చెరులోని మైత్రీమైదానంలో సోమవారం రాత్రి నిర్వహించిన సంగీతవిభావరి, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ భోజ్‌పూరి నటుడు, గాయకుడు కేసరీలాల్‌యాదవ్ హాజరై తన గీతాలతో అలరించారు. ఛాట్‌పూజా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సంగీతవిభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.