అంబేడ్కర్ భవన నిర్మాణం ఎప్పుడు?
ABN , First Publish Date - 2022-05-19T04:54:45+05:30 IST
పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీలో అంబేడ్కర్ భవన నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
చేర్యాల, మే 16: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీలో అంబేడ్కర్ భవన నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భవన నిర్మాణానికి ముందుగా ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. గత సంవత్సరం ఆగస్టు 9న మంత్రి తన్నీరు హరీశ్‌రావు భూమిపూజ కూడా చేశారు. భవన నిర్మాణానికి కేటాయించిన నల్లరేగడి భూమిలో బలవంతమైన నిర్మాణం కోసం మరిన్ని నిధులు అవసరపడతాయని అధికారులు సూచించారు. దీంతో మంత్రి హరీశ్‌రావు చొరవతో మరో రూ.80లక్షలు మంజూరు చేయించి, జీ+వన్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. కానీ తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనుల ప్రారంభానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదు.