మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-11-13T00:17:39+05:30 IST

జాతీయ నాణ్య తా ప్రమాణాల ప్రకారం గ్రామీణ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కేంద్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశా ఖ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ అన్నా రు. శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవల నిపుణుల బృందం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అం దిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించింది.

మెరుగైన వైద్యసేవలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కృష్ణప్రసాద్‌

భూదాన్‌పోచంపల్లి, నవంబరు 12: జాతీయ నాణ్య తా ప్రమాణాల ప్రకారం గ్రామీణ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కేంద్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశా ఖ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ అన్నా రు. శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవల నిపుణుల బృందం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అం దిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించింది. ఈ నిపుణుల బృందంలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీ నుంచి డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ పంకజ పాల్గొన్నారు. నేషనల్‌ క్వాలిటీ అనలిస్ట్‌ ఆరోగ్యకేంద్రంలోని ఆరు విభాగాలుగా విభజించి పరిశీలించారు. ఇందులో అవుట్‌ పేషెంట్‌ సేవలు, ఇన్‌పేషెంట్‌ సేవలు, ప్రసూతీ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ల్యాబ్‌ సేవలు, ఆరోగ్య కేంద్ర పర్యవేక్షణ విభాగాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌రావు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పరిపూర్ణాచారి, జిల్లా నాన్‌ కమ్యునకబుల్‌ డీసీఎస్‌ అధికారి డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌, చౌటుప్పల్‌ డివిజన్‌ డిప్యుటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ యశోద, ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి యాదగిరి, శ్రీధర్‌, జ్యోతి, పల్లె దవాఖానా డాక్టర్లు అమరేందర్‌, రాకేష్‌, సుచరిత, కపిల పాల్గొన్నారు.

Updated Date - 2022-11-13T00:17:42+05:30 IST