ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-12-06T01:28:50+05:30 IST
: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు. ప్రజాసమస్యలపై కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వ హించిన నిరసన కార్యక్రమం సంద ర్భంగా ఆయన మాట్లాడారు.
సూర్యాపేట టౌన్, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు. ప్రజాసమస్యలపై కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వ హించిన నిరసన కార్యక్రమం సంద ర్భంగా ఆయన మాట్లాడారు.ఽ దరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బం దులకు గురి చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీట్ ఇవ్వకపోవ డంతో రైతులకు ఎలాంటి ఆఽధారం లేకుండా పోతోం దన్నారు. దీంతో మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయనందున బ్యాంకుల్లో వడ్డీని ప్రభుత్వమే భరించాలన్నారు. పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి చివ్వెంల పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. కార్యక్రమంలో గుడిపాటి నర్సయ్య, బైర్ శైలేందర్‌గౌడ్, కక్కిరేణి శ్రీనివాస్, వేములకొండ పద్మ, సాగర్‌రెడ్డి, అమరవరపు శ్రీనివాస్, నరేష్‌చారి, కర్ణాకర్‌రెడ్డి, వెంకటనాగిరెడ్డి పాల్గొన్నారు.