ఒకపాట వెయ్యి ఉపన్యాసాల పెట్టు
ABN , First Publish Date - 2022-11-13T00:15:41+05:30 IST
ఒక పాట వెయ్యి ఉపన్యాసాల పెట్టు అని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మండలంలోని రాఘవాపురంలో శనివారం నిర్వహించిన రాఘవభారతి గ్రంథాలయ ప్రథమ వార్షికవేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సర్వమతాల వారు చదువుకునే ప్రవిత్రమైన మందిరం గ్రంథాలయమన్నారు.
సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
ఆత్మకూరు(ఎం), నవంబరు 12: ఒక పాట వెయ్యి ఉపన్యాసాల పెట్టు అని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మండలంలోని రాఘవాపురంలో శనివారం నిర్వహించిన రాఘవభారతి గ్రంథాలయ ప్రథమ వార్షికవేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సర్వమతాల వారు చదువుకునే ప్రవిత్రమైన మందిరం గ్రంథాలయమన్నారు. గ్రంథాలయం ఒక చెట్టు లాంటిదని, ఆ చెట్టు నీడలో సేద తీరిన ఎంతో మంది మేథావులు ఈ దేశాన్ని నడిపించారన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అపరమేథావిగా తీర్చిదిద్దింది గ్రంథాలయమేనన్నారు. కార్యక్రమంలో రాఘవాపురం, పాలడుగు సర్పంచ్‌లు దొండ కమలమ్మ, మర్రిపెల్లి యాద య్య, సామాజిక కార్యకర్తలు భూపతి వెంకటేశ్వర్లు, విజయకుమార్, గ్రంథాలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎండీ.నయీం, శాశ్వత దాత దొండ పురుషోత్తంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి, ప్రజాభారతి అధ్యక్షుడు తొర్ర ఉప్పలయ్య, ఎస్.ఎన్.చారి, హెచ్‌ఎం రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.