ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక: రాజగోపాల్ రెడ్డి
ABN , First Publish Date - 2022-11-01T14:28:15+05:30 IST
మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పార్టీల మధ్య పోరు కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పార్టీల మధ్య పోరు కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మునుగోడు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల్ని అవమానపరిచిన దుర్మార్గమైన పరిపాలన నుంచి విముక్తి కలిగించాలని కోరారు. మునుగోడు ప్రజలు బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గొద్దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపిచ్చారు. నీతికి కట్టుబడి పార్టీకి, పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని అన్నారు. రాజకీయాలు వేరు.. వ్యాపారం వేరని... తెలంగాణలో ప్రజాస్వామ్యం రావాలంటే బీజేపీ పువ్వు గుర్తుకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.