Home » Komatireddy Rajgopal Reddy
ఉదయమే పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తోన్న వారిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మందలించారు. ఉదయమే మద్యం సేవిస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి..? మిమ్మల్నే నమ్ముకున్న కుటుంబం ఏం కావాలి అని అడిగారు. వారిని అక్కడి నుంచి పంపించేశారు.
‘పొద్దుగాల తాగుడు షురూ చేస్తే ఎలా? పూట గడవటం ఎలా... కుటుంబం ఏం కావాలి?’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలువురు మద్యం ప్రియులను మందలించారు.
మందు బాబులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ పీకారు. సోమవారం ఉదయం మునుగోడు పట్టణంలోని పలు వైన్ షాపుల్లో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్మిట్ రూమ్‌ల్లో మద్యం తాగుతున్న మందు బాబులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంభోదించారు. అంతేకాదు.. తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభకే రానప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలెందుకని ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పారన్నారు. అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలుదాటుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ కూర్పు చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడారు.