TS News: మునుగోడులో ఎటు చూసినా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు..
ABN , First Publish Date - 2022-11-02T13:29:51+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక తప్పనిసరి అని తెలిసినప్పటినుంచి.. పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తగినంత మద్యం పోయించి...
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక తప్పనిసరి అని తెలిసినప్పటినుంచి.. పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తగినంత మద్యం పోయించి మత్తులో ముంచెత్తాయి. ఇప్పుడు ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా మద్యంత సీసాలు కనిపిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం మొత్తం మందులో మునిగిపోయింది. దాదాపు రూ. 160 కోట్ల మద్యం తాగినట్లు ఇక్కడ అధికారులు అంచనా వేశారు. ఎన్నికలు ముగిసే వరకు రూ. 2వందల కోట్లకు చేరే అవకాశం ఉంటుందన్నారు.
మామూలుగా ప్రతి నెల నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూ. 132 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ ఈనెల రూ. 2వందల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఓటర్లను ప్రలోభానికి గురిచేయడానికి మద్యం ఎక్కువగా పంపిణీ చేశారు. మునుగోడు ఓటర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడ కూడా ఆత్మీయ సమ్మేళనాలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఆ మద్యాన్ని కూడా కలుపుకుంటే మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల కోసం దాదాపు రూ. 3 వందల కోట్లకుపైగా మద్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.