ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర
ABN , First Publish Date - 2022-12-11T23:20:06+05:30 IST
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు మునుగోడు ని యోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన కె. రాజిరెడ్డి తెలిపారు.
చౌటుప్పల్ టౌన, డిసెంబరు 11: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు మునుగోడు ని యోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన కె. రాజిరెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో ఆదివారం జరిగి న మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల స మాఖ్య విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఈనెల 10న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వచ్చే నెల 7నుంచి 10వ తేదీ వరకు చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించామ ని తెలిపారు. ఆర్టీసీ లోని అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని, సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాలకు ప్రజలు సహకరించాలని కోరా రు. సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు ఎంవీ చా రి, సుర్కంటి మోహనరెడ్డి, బీజేఎం రెడ్డి, ఎం. అంజ య్య, కె. యాదయ్య, మోసిన పాల్గొన్నారు.