శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

ABN , First Publish Date - 2022-11-15T01:17:56+05:30 IST

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మేళ్లచెర్వులోని శివాలయాన్ని కోదడ రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌ దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. సూర్యాపేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని కూరగాయలతో అలంకరించారు.

శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
సూర్యాపేటలో కూరగాయలతో అలంకరించిన శివలింగం

మేళ్లచెర్వు, సూర్యాపేట కల్చరల్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి రూరల్‌, నవంబరు 14: కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మేళ్లచెర్వులోని శివాలయాన్ని కోదడ రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌ దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. సూర్యాపేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని కూరగాయలతో అలంకరించారు. నేరేడుచర్లలోని శివాలయంలో సామూహిక సత్యన్నారాయణ వ్రతాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ రాచకొండ రాంకోటేశ్వరావు పాల్గొన్నారు. తిరుమలగిరి మండలంలోని జలాల్‌పురం గ్రామంలోని శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో రుద్రవనం, వనప్రతిష్ఠ మహోత్స వంలో సీజీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు లీలా లక్ష్మారెడ్డి, వందే మాతరం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రవీంద్ర, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచెర్ల రామకృష్ణారెడ్డి సతీమణి పద్మారెడ్డి పాల్గొన్నారు. రూ. 20వేల విలువైన దేవాలయ సామగ్రిని లక్ష్మారెడ్డి పూజారికి అందజేసి, గుడి ఆవరణలో 200 పూల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ముత్తినేని సత్యం, సర్పంచ్‌ వెంకన్న, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పిల్లలమర్రి శివాలయానికి కిలో వెండి అందజేత

సూర్యాపేట రూరల్‌: సూర్యాపేట మునిసిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి శివాలయానికి గ్రామానికి చెందిన అయితగోని బిక్షం, సక్కుబాయి కుమారుడు అయితగోని మహేష్‌ పద్మజ దంపతులు కిలో వెండి వస్తువులు బహూకరించారు. ఐదు వెండి చెంబులు, తీర్థం గిన్నె, ఉద్దరినను ఆలయ కమిటీ చైర్మన్‌ వల్లాల సైదులు యాదవ్‌, అర్చకుడు మునగలేటి సంతోష్‌శర్మలకు అందజేశారు.

Updated Date - 2022-11-15T01:17:58+05:30 IST