పక్షులకు ఆవాసంగా దుశ్చర్ల పెంచిన అడవి

ABN , First Publish Date - 2022-02-12T06:48:13+05:30 IST

అడవులు అంతరించిపోతున్న సమయంలో దుశ్చర్ల సత్యనారాయణ పెంచిన అడవి మూగజీవాలకు, పక్షులకు నిలయంగా నిలుస్తోందని హైదరాబాద్‌కు చెందిన దక్కన్‌ బర్డ్స్‌ వాచర్స్‌ సొసైటీ సభ్యుడు శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు.

పక్షులకు ఆవాసంగా దుశ్చర్ల పెంచిన అడవి
తాను పెంచిన అడవిలో దక్కన్‌ బర్డ్స్‌ వాచర్స్‌తో దుశ్చర్ల సత్యనారాయణ

దక్కన్‌ బర్డ్స్‌ వాచర్స్‌ సొసైటీ సభ్యుడు శ్యామ్‌ప్రసాద్‌ 


మోతె, ఫిబ్రవరి 11: అడవులు అంతరించిపోతున్న సమయంలో దుశ్చర్ల సత్యనారాయణ పెంచిన అడవి మూగజీవాలకు, పక్షులకు నిలయంగా నిలుస్తోందని హైదరాబాద్‌కు చెందిన దక్కన్‌ బర్డ్స్‌ వాచర్స్‌ సొసైటీ సభ్యుడు శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. మండల పరిధిలోని రాఘవాపురం గ్రామశివారులో జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు సొంత భూమి 70 ఎకరాల్లో సృష్టించిన అడవిని అందులోని సుమారు 30 రకాల పక్షి జాతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అడవిలోని పక్షులను, చెరువుకట్టల వెంట అవి ఏర్పాటు చేసుకున్న గూళ్లను ఫొటోల్లో బంధించారు. వాటి ఆధారంగా నల్లమల అడవుల్లో కనిపించే పక్షుల జాతులను ఇక్కడి అడవిలో గుర్తించామని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్‌, ఎరుపు, తెలుపు రంగుల్లోని బుల్‌బుల్‌, స్మాల్‌గ్రీన్‌ పక్షు జాతులతో పాటు మొత్తం 30పైగా పక్షి జాతులు ఉన్నాయన్నారు. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు అంతరించిపోతున్న అటవీ జాతులను కాపాడేందుకు సత్యనారాయణ సేవలను అభినందించారు. వారి వెంట జలసాధన బృందం సభ్యులు, దక్కన్‌ బర్డ్స్‌ వాచర్స్‌ ఉన్నారు.

Updated Date - 2022-02-12T06:48:13+05:30 IST