దొరల అహంకారాన్ని అంతం చేస్తాం

ABN , First Publish Date - 2022-10-27T00:45:51+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తమను మోసం చేశాయంటున్న ప్రజలు బీఎస్పీ వైపే ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

దొరల అహంకారాన్ని అంతం చేస్తాం

మునుగోడు, అక్టోబరు 26: బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తమను మోసం చేశాయంటున్న ప్రజలు బీఎస్పీ వైపే ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పార్టీ అభ్యర్థి అందోజు శంకరా చారి గెలుపు కోరుతూ మునుగోడులో బుధవారం రాలీ నిర్వహించారు. ఇటీ వల టీఆర్‌ఎస్‌ నేతలు బీసీ వర్గాలను అవమానించేలా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా వేళ్లూనుకున్న దొరల ఆహం కారాన్ని అంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధి అందోజు శంకరాచారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, నాయకులు పల్లేటి రవీందర్‌, మీడియా ఇన్‌చార్జి దూడపాక నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-27T00:45:51+05:30 IST