Home » Tenali
ఈ నెలాఖరులో మరో పీఎ్సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
టైప్ రైటర్ ద్వారా అద్భుతమైన చిత్రాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు తెనాలి యువకుడు నిజాముద్దీన్. మిగతా టైప్ రైటర్లకన్నా భిన్నంగా చిత్రాలు వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
అమాయకులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) రోజురోజుకీ కొంతపంథా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎమ్మెల్యేల పేరిటా మోసాలకు దిగుతున్నారు.
వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.
Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్ మిశ్రా స్పందించారు. ఓటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.
అధికార వైసీపీ తిక్క తీరేలా ఓ ఓటర్ చెంప పగలగొట్టడం గుంటూరులో చర్చనీయాంశం అయింది. తెనాలి వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్(Annabathuni Shiva Kumar) క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నిన్న ఇరవై కిలోమీటర్లు ఎండలో పవన్ పాదయాత్ర చేశారు. ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పూర్తిగా జ్వరం తగ్గక పోవడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు.