నేడు బాసర సరస్వతీ దేవి ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2022-10-25T06:49:38+05:30 IST
సూర్యగ్రహణం నేపథ్యంలో నేడు బాసర సరస్వతీ దేవి ఆలయం మూసివేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
నిర్మల్: సూర్యగ్రహణం నేపథ్యంలో నేడు బాసర సరస్వతీ దేవి ఆలయం మూసివేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ద్వారబంధనం, ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు చేశారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రేపటి నుంచి యధావిధిగా ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి.