MLC Kavita : కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు

ABN , First Publish Date - 2022-11-08T06:13:48+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని, దీంతో ఏ ఎన్నికలైనా కేసీఆర్‌ పక్షానే ప్రజలు

MLC Kavita : కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు
Kavitha

మునుగోడు ఫలితంతో ప్రత్యర్థుల నోర్లు మూత: కవిత

సుభా్‌షనగర్‌ (నిజామాబాద్‌), నవంబరు 7 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని, దీంతో ఏ ఎన్నికలైనా కేసీఆర్‌ పక్షానే ప్రజలు నిలుస్తారని మరోమారు నిరూపితమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్తిక మాసం సందర్భంగా సోమవారం నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కార్తికమాసం రోజున తెలంగాణ ప్రజలు అద్భుతమైన ఫలితాన్ని అందజేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదిస్తూ మునుగోడు ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. గత కొన్ని రోజులుగా అవాకులు, చెవాకులు పేలిన వారి నోర్లు మూతపడేలా మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎ్‌్‌సకు పట్టం కట్టారని అన్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ నాయకత్వానికి మద్దతు పలికిన మునుగోడు ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటామని తెలిపారు. నల్లగొండలో ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించామని.. ఇకముందు తెలంగాణలో ఏ ఎన్నికలైనా టీఆర్‌ఎ్‌సదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-08T06:13:49+05:30 IST