క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-12-17T00:21:42+05:30 IST

కామారెడ్డి పట్టణంలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈ నెల 19 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలి

కామారెడ్డిటౌన్‌, డిసెంబర్‌ 16: కామారెడ్డి పట్టణంలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈ నెల 19 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌ కార్యాలయంలోని సమావేశ హాల్‌లో అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో 720 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు తెలియజేయాలని సూచించారు. దివ్యాంగులు ఉంటే వారి సదరం నెంబర్‌ సర్వే పత్రం లో నమోదు చేయాలన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటమన్నారు. ఒక సర్వే బృందం ప్రతి రోజూ పది మంది లబ్ధిదారుల వివరాలు సేకరించాలన్నారు. లబ్ధిదారులు ఆఽధార్‌ కార్డు, కుల ధువీకరణ పత్రం, కరెంట్‌ బిల్లు, రేషన్‌ కార్డు నెంబర్‌ తదితర వివరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రేం కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

రూ.529 కోట్ల రుణాలు అందజేశాం..

జిల్లాలోని 9038 స్వయం సహాయక సంఘాలకు రూ. 529 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందజేసినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఐకేపీ అధికారులతో బ్యాంక్‌ లింకేజీ రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15,319 స్వయం సహాయక సంఘాలకు రూ. 854 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందజేచాలని లక్ష్యం పెట్టుకున్నమన్నారు. ఈ రుణాలతో మహిళలు సోలర్‌ యూనిట్‌లు, డెయిరీ చేపల పెంపకం, గేదెల పెంపకం, పాలు పితికే యంత్రాలు తీసుకునే విధంగా సమన్వయ కర్తలు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. 1634 స్వయం సహాయక సంఘాలు రూ.12.69 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు బాకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధారి, జుక్కల్‌, మద్నూర్‌, నస్రూల్లాబాద్‌ మండలాలలో బ్యాం క్‌ లింకేజీ రుణాలు బాకాయిలు ఉన్నాయని, వాటి కో సం బ్యాంక్‌ లింకేజీ స్పెషల్‌ కమిటీల ద్వారా వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో సా యన్న, అదపు డీఆర్‌డీవో మురళి కృష్ణ, డీపీఎంలు రవీందర్‌రావు, సుధాకర్‌, రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T00:21:44+05:30 IST