ఏసీబీ వలలో ఇన్‌చార్జి తహసీల్దార్
ABN , First Publish Date - 2022-11-04T05:53:16+05:30 IST
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి ఓ రైతు నుంచి లంచం తీసుకున్న కంప్యూటర్ ఆపరేటర్
సదాశివనగర్, నవంబరు 3: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి ఓ రైతు నుంచి లంచం తీసుకున్న కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మణ్, ఇన్‌చార్జి తహశీల్దార్ మానసలను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆన ంద్‌కుమార్ కథనం మేరకు రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు బలరాం తన పెద్దమ్మ పేరుపైన ఉన్న 30 గుంటల వ్యవసాయ భూమిని తన పేరుపై మార్పు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ధరణి కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మణ్, ఇన్‌చార్జి తహసీల్దార్ మానసలను పలుమార్లు కలిసి పట్టా మార్చాలని కోరారు. ఈ పని చేయాలంటే ఆన్‌లైన్ ఫీజు రూ.4 వేలు, అదనంగా మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని ఇన్‌చార్జి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇచ్చుకోలేనని రైతు చెప్పగా, రూ.4 వేలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించగా, పథకం ప్రకారం గురువారం ఇద్దరు ఉద్యోగులకు డబ్బు ఇప్పించి, రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.