TS News: పట్టా భూములను ప్రోహిబిటెడ్ భూములుగా చూపడంపై హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-12-06T16:52:09+05:30 IST

Hyderabad: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టు‌లో పిల్ వేశారు. పట్టాభూములను

TS News: పట్టా భూములను ప్రోహిబిటెడ్ భూములుగా చూపడంపై హైకోర్టులో పిటిషన్

Hyderabad: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టు‌లో పిల్ వేశారు. పట్టాభూములను పోర్టల్‌లో ప్రోహిబిటెడ్ భూములుగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పిటిషన్ వేశారు. దాదాపు 8 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్ భూమిగా నమోదు అయిందని, రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రెవెన్యూ, అటవీ శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2022-12-06T16:53:29+05:30 IST