Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ పరుగు పందెం.. వెనుకపడ్డ రేవంత్, తెలంగాణ నేతలు
ABN , First Publish Date - 2022-10-30T19:06:29+05:30 IST
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉత్సాహంగా కనిపించారు. అందరినీ కలుస్తూ, అందరితో మాట్లాడుతూ.. ఉత్సాహంగా జోడోయాత్ర కొనసాగించారు. 44వ జాతీయరహదారిపై వాహనాలు ఆపి ప్రయాణీకులు, వాహనదారులు రాహుల్‌ని కలిశారు.
మహబూబ్‌నగర్: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉత్సాహంగా కనిపించారు. అందరినీ కలుస్తూ, అందరితో మాట్లాడుతూ.. ఉత్సాహంగా జోడోయాత్ర కొనసాగించారు. 44వ జాతీయరహదారిపై వాహనాలు ఆపి ప్రయాణీకులు, వాహనదారులు రాహుల్‌ని కలిశారు. జాతీయరహదారిపై ఆదివారం జోడోయాత్ర (Jodo Yatra)లో నడుస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మహబూబ్‌నగర్ Mahabubnagar జిల్లా రాజాపూర్ సమీపంలో ఆయన్ను కలిసిన చిన్నారులు ఆఫ్రాన్, అమీర్‌తో ముచ్చటించారు. రోజూ ఉదయాన్నే మార్నింగ్‌వాక్ చేస్తారా.. అని అడిగారు. తన తో రన్నింగ్ చేస్తారా?. అని చిలిపిగా వారిని ప్రశ్నించిన రాహుల్ పరుగుపందెం పెట్టుకుందామా అని అడిగి చిన్నారులతో కలిసి పరుగెత్తారు. దాదాపు 100 మీటర్ల మేర రాహుల్ పరుగుపెట్టారు. రాహుల్ పరుగెత్తడంతో ఆయన వెనక చిన్నారులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఇతర నాయకులు పరుగులెత్తారు. వారంతా రాహుల్ అంత స్పీడ్‌గా పరుగెత్తలేక వెనకబడ్డారు. రాహుల్‌గాంధీ పరుగెత్తుతున్నప్పుడు పాదయాత్రలో ఉన్న జనం కేరింతలు కొట్టారు.
బతుకమ్మ ఆడిన రాహుల్‌గాంధీ
53వ రోజు పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ట్రీబేక్ సమయంలో బతుకమ్మ నృత్య ప్రదర్శనను తిలకించారు. జోడోయాత్ర సాంస్కృతికకమిటీ ఛైర్మన్ మల్లుభ ట్టివిక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో రాహుల్ నాయకులు, మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రాహుల్‌తో పాటు సీనియర్‌నేత జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తదితర నాయకులు ఉత్సాహంగా ’’ చిత్తూ చిత్తూల బొమ్మ, శివునీ ముద్దుల గుమ్మ..’’ అనే పాటకు వీరు లయబద్ధంగా నృత్యం చేశారు.