Home » Rahul Gandhi
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
యువతకు ఉపాధి కల్పనపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మూడు ప్రశ్నలు సంధించారు. పెద్దపెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చి.. చిన్న పరిశ్రమలను పక్కనపెడితే ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలిపుతామని చెప్పారు.
రిక్రూట్మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసే ప్లాన్ వెల్లడించారు. పట్నాలో జరిగిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’లో ఆయన వెనుకబడిన వర్గాలకు కులగణన నిర్వహిస్తామని చెప్పారు
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ సుంకాలు భారత స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చిన తర్వాత రాహుల్ గాంధీ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. మనకొద్దీ వ్యాపారం అనేలా..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. బీహార్‌లో అదనపు సీట్లు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ 'ఏ' టీమ్‌గా ఉండబోతోందని, బీ టీమ్‌గా కాదని చెబుతున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా పలువులు బీజేపీ నేతలు ఈ బిల్లుకు క్రైస్తవ సంఘాలు, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ మద్దతు తెలిపినట్టు చెప్పారు. దేశంలో వక్ఫ్‌కు 39 లక్షల ఎకరాలు ఉన్నట్టు ఒక అంచనాగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.
రేవంత్ రెడ్డి వైఖరి కారణంగా కంచ గచ్చిబౌలిలోని వందల ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, నెమళ్లు సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.