కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-10-24T16:43:29+05:30 IST

కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బిక్షతో ఎదిగినవాళ్లే.. పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బిక్షతో ఎదిగినవాళ్లే.. పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులు చేశారని, మన కుటుంబసభ్యులపై దాడి జరుగుతుంటే పట్టించుకోమా అని ప్రశ్నించారు. మునుగోడులో కలిసి కదం తొక్కుదామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-10-24T16:43:29+05:30 IST