హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

ABN , First Publish Date - 2022-12-28T16:30:53+05:30 IST

నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బంజారాహిల్స్‌లోని ఓ హాస్టల్‌పై పోలీసుల దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బంజారాహిల్స్‌లోని ఓ హాస్టల్‌పై పోలీసుల దాడులు నిర్వహించారు. నిందితులు నుంచి 48 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. యమన్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూఇయర్‌ వేడుకలు టార్గెట్‌గా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ ముఠా తరలిస్తున్నారు. గ్రాము డ్రగ్స్‌ను రూ.10 వేలకు ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-12-28T16:30:55+05:30 IST