బండి సంజయ్‌కు ఇంద్రకరణ్రెడ్డి సవాల్
ABN , First Publish Date - 2022-12-05T16:50:08+05:30 IST
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అవినీతి నిరూపిస్తే రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతానని ఆయన సవాల్ విసిరారు. నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? అని బండి సంజయ్‌ను ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితపై అవాకులు, చివాకులు పేలితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.