మేం ప్రభుత్వాలు నడపలేదా?: వైఎస్ విజయలక్ష్మి
ABN , First Publish Date - 2022-11-29T16:40:34+05:30 IST
వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్ట్‌పై వైఎస్ విజయలక్ష్మి (YS Vijayamma) మండిపడ్డారు.
హైదరాబాద్: వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్ట్‌పై వైఎస్ విజయలక్ష్మి (YS Vijayamma) మండిపడ్డారు. వైఎస్ షర్మిల చేసిన నేరం ఏంటి? అని వైఎస్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘మేం ప్రభుత్వాలు నడపలేదా?.. మాకు పోలీసులు కొత్తకాదు. పోలీసులు ఇలా చేయడం తప్పు కాదా?. వ్యక్తిగతంగా ఏం విమర్శ చేసిందో మీరే చెప్పండి. ప్రజలు చెప్పిన సమస్యలనే షర్మిల ప్రశ్నించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ తీసేయలేరని విజయలక్ష్మి పేర్కొన్నారు.