దైవ దర్శనం కోసం వెళ్తుండగా.. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..
ABN , First Publish Date - 2022-10-28T21:22:13+05:30 IST
మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తాడు అన్నట్లుగా.. ఒక్కోసారి ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ కుటుంబం విషయంలో ఇలాగే జరిగింది. ఇధ్దరు కూతుళ్లతో ఆనందంగా దైవ దర్శనం కోసం బయలుదేరారు దంపతులు. తిరుపతిలో మొక్కు చెల్లించుకుని రావాలని వెళ్లిన వారు.. అక్కడికి చేరుకోకుండానే ..
మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తాడు అన్నట్లుగా.. ఒక్కోసారి ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ కుటుంబం విషయంలో ఇలాగే జరిగింది. ఇధ్దరు కూతుళ్లతో ఆనందంగా దైవ దర్శనం కోసం బయలుదేరారు దంపతులు. తిరుపతిలో మొక్కు చెల్లించుకుని రావాలని వెళ్లిన వారు.. అక్కడికి చేరుకోకుండానే అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటామని ఊహించలేకపోయారు. దారి మధ్యలో జరిగిన ప్రమాదంలో తల్లీకూతుళ్లు.. సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..
తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో (Jogulamba Gadwal District) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. బాన్సువాడలోని శాంతినగర్‌లో మెరిగె ప్రకాశ్ తన కుటుంబ సభ్యులైన భార్య లక్ష్మీ (50) , కూతుళ్లు శ్రీలత (16), మానసలతో నివాసం ఉంటున్నాడు. ప్రకాశ్ మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అక్టోబర్ 28న తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుపతి (Tirupati Tirumala) దైవ దర్శనానికి బయలుదేరి వెళ్లారు.
Viral Video: ఆస్పత్రిలో మహిళ పట్ల సిబ్బంది నిర్వాకం.. అంతా చూస్తుండగా..
అయితే మార్గమధ్యలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న వ్యాన్‌ను (road accident) అతి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య లక్ష్మి, పెద్ద కూతురు శ్రీలత అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రకాశ్, చిన్న కూతురు మానసకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదఛాయలు అలుముకొన్నాయి. దైవ దర్శన కోసం వెళ్తూ కానరానిలోకాలకు చేరుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకున్నారు.
భర్త వీడియో తీస్తుండగా.. భార్య షాకింగ్ నిర్ణయం.. చివరకు బంధువుల రాకతో..