హమ్మయ్య.. అంగన్‌వాడీలొచ్చారు

ABN , First Publish Date - 2022-12-21T23:30:51+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అంగన్‌వాడి టీచర్లు, హెల్పర్ల నియామకం ఎట్టకేలకు పూర్తయింది. జిల్లాలో పలు కారణాల చేత ఏర్పడ్డ ఖాళీలతో పాటుగా నూతనంగా ఏర్పాటైన మినీ అంగన్‌వాడీల్లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 మంది అంగన్‌వాడీ టీచర్లు, ముగ్గురు మినీ అంగన్‌వాడీ టీచర్లు, 24 మంది హెల్పర్లు విధుల్లో చేరారు.

హమ్మయ్య.. అంగన్‌వాడీలొచ్చారు
పటేల్‌గూడెంలో బాఽధ్యతలను తీసుకుంటున్న అంగన్‌వాడీ టీచర్‌ సంధ్య

ఎట్టకేలకు పోస్టులు భర్తీ చేసిన సర్కారు

12 మంది టీచర్లు.. 24 మంది హెల్పర్ల నియామకం

జిల్లా వ్యాప్తంగా విధుల్లో చేరిన నూతన ఉద్యోగులు

లింగాలఘణపురం, డిసెంబరు 21: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అంగన్‌వాడి టీచర్లు, హెల్పర్ల నియామకం ఎట్టకేలకు పూర్తయింది. జిల్లాలో పలు కారణాల చేత ఏర్పడ్డ ఖాళీలతో పాటుగా నూతనంగా ఏర్పాటైన మినీ అంగన్‌వాడీల్లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 మంది అంగన్‌వాడీ టీచర్లు, ముగ్గురు మినీ అంగన్‌వాడీ టీచర్లు, 24 మంది హెల్పర్లు విధుల్లో చేరారు. అక్టోబరు-2021లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం గత అక్టోబరులో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించింది. అర్హులను గుర్తించి డిసెంబరు-15న నియామక ఉత్తర్వులను జారీ చేసింది. గౌరవవేతనంగా అంగన్‌వాడి టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ. 7800 ఫిక్స్‌డ్‌ సాలరీగా ప్రభుత్వం అందజేస్తోంది.

విధుల్లో చేరినవారి వివరాలు

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, కొడకండ్ల మూడు క్లస్టర్ల పరిధిలో కొత్తగా నియామకమైన ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి. అంగన్‌వాడి టీచర్లుగా జనగామ క్లస్టర్‌లో పటేల్‌గూడెం (ఒకటో కేంద్రం)- బండ సంధ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ క్లస్టర్‌లో ఎర్రగడ్డతండా- భూక్యా శ్రీలత, పిట్టలగూడెం- దేవరాయ శ్రీలత(సిద్దిని), గేమ్యాతండా- నూనావత్‌ కవిత, చిల్పూరు (నాలుగవ కేంద్రం)- గంధమాల అరుణ, వెల్ది (మూడోకేంద్రం)- దేవర లావణ్య, ఖిలాషాపూర్‌ - గిరబోయిన అనిత, స్టేషన్‌ఘన్‌పూర్‌ (ఒకటో కేంద్రం)- మారేడుపాక లిఖితాభవాని, దేశినితండా-మాలోత్‌ మాధవి, గాలిగుట్టతండా(మినీఅంగన్‌వాడీ)- లకావత్‌ ప్రాణావతి, మాసిరెడ్డిగూడెం (మినీఅంగన్‌వాడీ)- పొన్నగంటి శ్రీవాణి, కొడకండ్ల క్లస్టర్‌ పరిధిలోని దంతెలతండా (మినీఅంగన్‌వాడీ)-గుగులోత్‌ రజిత విధుల్లో చేరారు.

అంగన్‌వాడీ హెల్పర్లుగా జనగామ క్లస్టర్‌లో కేసిరెడ్డిపల్లి(రెండో కేంద్రం)-ముద్దెపాక గీతాంజలి, లింగంపల్లి(ఒకటో కేంద్రం)- దారం రవళి, బొత్తలపర్రె(ఒకటో కేంద్రం)-బానోతు వనిత, నాగిరెడ్డిపల్లి(రెండో కేంద్రం)-తాళ్లపల్లి అశ్విని, చీటూరు(రెండో కేంద్రం)-గజరాజుల శారధ, కొడకండ్ల క్లష్టర్‌ పరిధిలోని దొడ్లబండ తండా-బానోతు రజిత, శివునిగుడితండా-దారావత్‌ మంజుల, రేగుల(ఒకటో కేంద్రం)- గాయాల స్వర్ణలత, పొట్టిగుట్టతండా- జాటోత్‌ ఝాన్సీ, బడితండా-బానోతు సునీత, రాంబోజుగూడెం-జోగు మానస, చిన్నపెండ్యాల(ఒకటోకేంద్రం)-బండారి రజిత, నష్కల్‌- కట్ల మానస, జఫర్‌ఘడ్‌-బాషబోయిన కల్పన, మారపల్లిగూడెం-గుర్రపు రమ, కుర్చపల్లి-సామల తేజశ్రీ, పిట్టలగూడెం- మానుపాటి సుమలత, స్టేషన్‌ఘన్‌పూర్‌- వడ్లకొండసునీత, వెంకటాద్రిపేట-భట్టు మానస, ఉప్పుగల్లు- కొడారి అరుణ, ఫతేషాపూర్‌- మనుక స్రవంతి, పొట్టిగుబ్బడి తండా-బానోతు సుజాత, తిమ్మంపేట-ఆలియా అహ్మది, శివునిపల్లి-చిలుక రజిత నియామకమయ్యారు. కాగా వీరంతా గత రెండ్రోజులుగా విధుల్లో చేరడంతో అంగన్‌వాడీ కేంద్రాల సక్రమ నిర్వహణకు మార్గం సుగమమైంది.

Updated Date - 2022-12-21T23:31:04+05:30 IST