ప్రాణం తీసిన చాక్లెట్..
ABN , First Publish Date - 2022-11-27T00:50:12+05:30 IST
చాక్లెట్ తింటుండగా గొం తులో ఇరుక్కొని ఊపిరాకడ ఓ బాలుడు మృతి చెందా డు. ఈ ఘటన వరంగల్‌లో శనివారం చోటుచేసుకోగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం నుంచి కన్‌గహాన్‌సింగ్ 20ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం వరంగల్‌కు వలస వచ్చాడు. వరంగల్ నగరంలోని జేపీఎన్‌రోడ్‌లో ఎలక్ర్టికల్ షాపు నిర్వహిస్తున్నాడు. జేపీఎన్ రోడ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మార్గంలో నివాసముంటున్న కన్‌గహాన్‌సింగ్‌కు భార్య గీత, ముగ్గురు కుమారులు, కు మార్తె ఉన్నారు. వీరు పిన్నావారివీధిలోని శారదా పబ్లిక్‌స్కూల్‌లో చదువుతున్నారు.
గొంతులో ఇరుక్కొని ఊపిరాడక బాలుడి మృతి
మట్టెవాడ, నవంబరు 26: చాక్లెట్ తింటుండగా గొం తులో ఇరుక్కొని ఊపిరాకడ ఓ బాలుడు మృతి చెందా డు. ఈ ఘటన వరంగల్‌లో శనివారం చోటుచేసుకోగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం నుంచి కన్‌గహాన్‌సింగ్ 20ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం వరంగల్‌కు వలస వచ్చాడు. వరంగల్ నగరంలోని జేపీఎన్‌రోడ్‌లో ఎలక్ర్టికల్ షాపు నిర్వహిస్తున్నాడు. జేపీఎన్ రోడ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మార్గంలో నివాసముంటున్న కన్‌గహాన్‌సింగ్‌కు భార్య గీత, ముగ్గురు కుమారులు, కు మార్తె ఉన్నారు. వీరు పిన్నావారివీధిలోని శారదా పబ్లిక్‌స్కూల్‌లో చదువుతున్నారు. ఇదిలా ఉండగా కన్‌గహాన్‌సింగ్ నెల కిందట తన వ్యాపారంలో భాగంగా విదేశాలకు వెళ్లాడు. అక్కడి నుంచి పిల్లల కోసం చాక్లెట్‌లను తీసుకువచ్చాడు. కాగా, శనివారం రోజూలాగే కన్‌గహాన్‌సింగ్ తన పిల్లలను ద్విచక్ర వాహనంపై స్కూల్‌లో దింపేందుకు సమాయత్తమయ్యాడు. పిల్లల కోసం తల్లి గీత విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్లు ఇచ్చింది. వీటిని తింటూ చిన్నారులు బైక్ ఎక్కారు. రెండో కుమారుడు సందీప్ (8) చాక్లెట్ తినుకుంటూ పాఠశాలోని మొదటి అంతస్థులోని తన రెండో తరగతి గదికి వెళ్లాడు. కాసేపటికే తరగతి గదిలో స్ప్రహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం కన్‌గహాన్‌సింగ్‌కు సమాచారం అందించడంతో హుటాహుటిన బాలుడిని ఎంజీఎం తరలించారు. బాలుడి గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగా బాలు డు ఊపిరాడక మృతిచెందాడు.ఈ ఘటనతో పిన్నావారివీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం రైల్వేగేటు ప్రాంతంలోని శ్మశానవాటిక లో కుటుంబ సభ్యులు బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు.