Mission Bhagiratha: లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్..తడిసి ముద్దైన వరి ధాన్యం

ABN , First Publish Date - 2022-12-01T11:14:13+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రటిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి

Mission Bhagiratha: లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్..తడిసి ముద్దైన వరి ధాన్యం

Warangal : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రటిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి(Mission Bhagiratha Scheme) తూట్లు పడుతున్నాయి. ప్రతి ఇంటికి మంచినీరు అందించే పథకం రోడ్లమీదే ఆవిరైపోతుంది. కాగా, గురువారం ఉదయం ఖానాపూర్ మండల కేంద్రంలో 365 జాతీయ రహదారి(National Highway)పై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో పెద్ద ఎత్తున్న భగీరథ నీళ్లు రోడ్డుమీద వరదలై పారుతున్నాయి. నెలల తరబడి పంటను ఆశించిన రైతు కళ్లలో నీరుపోసింది మిషన్ భగీరథ పైప్ లైన్. రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం మొత్తం నీటిపాలు అయ్యాయి. దీంతో 10 ఎకరాల పంటను రైతులు నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై నీరు వృథాగా పోతుంది.

Updated Date - 2022-12-01T11:14:16+05:30 IST