Warangal: షర్మిల పాదయాత్రకు పోలీసుల బ్రేక్

ABN , First Publish Date - 2022-12-04T09:28:32+05:30 IST

వరంగల్ జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర (Padayatra)కు పోలీసులు బ్రేక్ (Break) వేశారు.

Warangal: షర్మిల పాదయాత్రకు పోలీసుల బ్రేక్

వరంగల్ జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర (Padayatra)కు పోలీసులు బ్రేక్ (Break) వేశారు. ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, లింగగిరి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ వరంగల్ పోలీసులకు లేఖ రాశారు. ఆ లేఖను ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని తిరిగి షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒకసారి అనుమతి ఇస్తేనే వ్యక్తిగత దూసుషణలకు దిగి.. శాంతిభద్రతల సమస్యకు కారణమయ్యారని నోటీసులో పేర్కొన్నారు. దానిపై వివరణ ఇచ్చాకే అనుమతి ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇవాళ పాదయాత్రను వాయిదావేసుకున్నామని వైఎస్ఆర్టీటిపీ వర్గాలు ప్రకటించాయి.

Updated Date - 2022-12-04T09:28:36+05:30 IST