విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి

ABN , First Publish Date - 2022-11-08T23:56:37+05:30 IST

కాళ్లు కడుక్కుంటున్నప్పుడు నీళ్లు మీద పడ్డాయని కోపంతో 8వ తరగతి విద్యార్థిపై తొమ్మిది తరగతి విద్యార్థులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తనీ్‌షకుమార్‌, అతడి తండ్రి రాజేశ్వర్‌రావులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి
తనీ్‌షకుమార్‌ వీపుపై అయిన గాయాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి

కమలాపూర్‌ జ్యోతిబా పూలే పాఠశాలలో ఆలస్యంలో వెలుగులోకి ఘటన

కమలాపూర్‌, నవంబరు 8: కాళ్లు కడుక్కుంటున్నప్పుడు నీళ్లు మీద పడ్డాయని కోపంతో 8వ తరగతి విద్యార్థిపై తొమ్మిది తరగతి విద్యార్థులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తనీ్‌షకుమార్‌, అతడి తండ్రి రాజేశ్వర్‌రావులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని పోతరాజుపల్లి గ్రామానికి చెందిన దుమ్మాటి రాజేశ్వర్‌రావు- రాణి దంపతుల కుమారుడు దుమ్మాటి తనీ్‌షకుమార్‌ కమలాపూర్‌లోని మహాత్మజ్యోతిబాఫూలే బాలుర గురుకుల సంక్షేమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా, పాఠశాలలో 15 రోజుల కిందట తనీ్‌షకుమార్‌ తన కాళ్లు కడుగుకుంటుండగా పక్కనున్న 9వ తరగతి విద్యార్థులపై పడ్డాయి. దీంతో వెంటనే తనీ్‌షకుమార్‌ను 9వ తరగతి విద్యార్థులు చెంపపై కొట్టారు. అనంతరం జరిగిన సంఘటన గురించి తనీ్‌షకుమార్‌ తన మిత్రులకు చెప్పుతుండగా విన్న 9వ విద్యార్థులు వచ్చి తమ గురించి ఏమి చెప్పుతున్నావని అంటూ తనీ్‌షకుమార్‌ను డార్మెటరీ హాలులోకి తీసుకెళ్ళి దాడి చేశారు. దీంతో జరిగిన విషయం విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పగా 9వ తరగతి విద్యార్థులను మందిలించారు. దీంతో ఆగ్రహం చెందిన 9వ తరగతి విద్యార్థులు మరుసటి రోజు మళ్లీ వచ్చి తనీ్‌షకుమార్‌ను చితకబాదారు. దీంతో తనీ్‌షకుమార్‌ వీపుపై గాయాలయ్యాయి.

కాగా, ఆదివారం తనీ్‌షకుమార్‌ను చూసేందుకు వచ్చిన తండ్రి రాజేశ్వర్‌రావుకు విషయం తెలియడంతో పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయంపై పోలీసులకు విన్నవించారు. దీంతో పోలీసులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ న్యాయం జరగకపోతే తిరిగి పోలీసుస్టేషన్‌కు రమ్మని సూచించారు. అనంతరం రాజేశ్వర్‌రావు తన కుమారుడు తనీ్‌షకుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం మంగళవారం తనీ్‌షకుమార్‌ తండ్రి రాజేశ్వర్‌రావు విలేకరులకు వివరాలను వెల్లడించాడు. తన కుమారుడిపై 9వ తరగతి విద్యార్థులు 8 మంది కలిసి దాడి చేసి గాయపరిచారన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువైందన్నారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడి చేసిన విద్యార్థులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా, ఈ విషయంపై ఎంజేపీ బాలురు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.వెంకటరమణను వివరణ కోరగా.. ఆ రెండు రోజులు ఓడీపై ఇతర పాఠశాలలో ఇన్స్‌పెక్షన్‌ డ్యూటీలో ఉన్నానని తెలిపారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి సంబంధిత విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Updated Date - 2022-11-08T23:56:39+05:30 IST