Modi Telangana Tour: సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు: కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-11-12T16:53:30+05:30 IST
రైతులకు మేలు చేసేలా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రామగుండం (Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
రామగుండం: రైతులకు మేలు చేసేలా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రామగుండం (Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో మెజార్టీ షేర్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని, సింగరేణిని ఎవరు ప్రైవేట్‌పరం చేస్తారు? అని ప్రశ్నించారు. సింగరేణి (Singareni)ని ప్రైవేట్‌పరం చేస్తారని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ కోల్ పరిశ్రమనూ ప్రైవేట్‌పరం చేయడంలేదని తెలిపారు. రామగుండం ఫ్యాక్టరీతో తెలంగాణ (Telangana)కు ఎరువుల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. రూ.6,338 కోట్లతో ఫ్యాక్టరీ పునరుద్ధరించామని తెలిపారు. కేంద్రం ధాన్యాన్ని కొనడం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో ధాన్యానికి MSP రూ.1360గా ఉండేదని, ప్రస్తుతం ధాన్యం మద్దతు ధర రూ.2,040కి పెంచామని ప్రకటించారు. కేంద్రం రూ.26 వేల కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.