AP NEWS: అనకాపల్లి జిల్లాలో ఘోరం.. మహిళా కమిషన్ సభ్యురాలి సోదరితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు
ABN , First Publish Date - 2023-08-22T00:42:21+05:30 IST
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏపీ మహిళా కమిషన్(AP Women's Commission)లో సభ్యురాలి సోదరిపై గుర్తు తెలియని యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అనకాపల్లి(Anakapalli): అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏపీ మహిళా కమిషన్(AP Women's Commission)లో సభ్యురాలి సోదరిపై గుర్తు తెలియని యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13వ తేదీన పోలీసులు దిశా చట్టం(Disha Law)కిందా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు బయటికి చెప్పకుండా పరవాడ పోలీసులు గోప్యంగా ఉంచారు. తెలుగుదేశం నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చొరవతో ఈ ఘటన బయటికి వచ్చింది. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ.. సాధారణ కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు... దిశా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీకి చెందిన మహిళ అయినా.. టీడీపీ పార్టీ బాధితురాలికి అండగా ఉంటుందని బండారు తెలిపారు.