AAG: స్కిల్ డవలప్‌మెంట్ స్కాంలో అన్ని ఆధారాలను ఏసీబీ కోర్టుకు అందచేశాం
ABN , First Publish Date - 2023-10-04T19:06:25+05:30 IST
స్కిల్ డవలప్ మెంట్ కేసులో (skill development case) టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) చేసిన అన్ని స్కాంల ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు అందచేశామని అదనపు న్యాయవాది (AAG Ponnavolu Sudhakar Reddy) తెలిపారు.
విజయవాడ: స్కిల్ డవలప్ మెంట్ కేసులో (skill development case) టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) చేసిన అన్ని స్కాంల ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు అందచేశామని అదనపు న్యాయవాది (AAG Ponnavolu Sudhakar Reddy) తెలిపారు. జీఎస్టీ అధికారులే స్కాం బయటపెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది కాదన్నారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు 15 నిముషాల్లో అయిపోతుందని, ఢిల్లీ నుంచి వచ్చిన పనోళ్లు గంటల సేపు వాదనలు వినిపించారని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
"ప్రభుత్వం తరపున మేము వాదనలు వినిపించాం. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని వాదించాం. టీడీపీ అకౌంట్లలో రూ. 27 కోట్లు పడ్డాయని విచారణలో తేలింది. వాళ్ళ అకౌంటెంట్‌కు విచారణకు రావాలని నోటీసులు పంపాం. ఈ నెల 10వ తేదీన విచారణకు వస్తామని చెప్పారు." అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.