Home » Skill Development Case
రాష్ట్ర యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయదలచిన నైపుణ్య విశ్వవిద్యాలయం ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతిలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని, 50 ఎకరాల భూమి కేటాయించారు.
చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దుపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి నెలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో విచారణ చేస్తున్న ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.
సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు ద్వారా(సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలె న్స్ ప్రాజెక్టు).. 2016-19 కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వదిలి వెళ్లిన లూలు గ్రూప్ సంస్థ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి మరో భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఇటీవలే రూ.100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని ‘మేఘా’ ప్రకటించింది.
స్కిల్ కేసు తాజా ఆస్తుల అటాచ్‌మెంట్‌లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్‌మెంట్‌లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. ఇందులో కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు.
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా... ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని లాయర్స్ కోరారు. దీంతో నాలుగు వారాల్లో చెప్పాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ఆదేశించారు.