ACB court: చంద్రబాబును విచారించేందుకు 12 మందికి అనుమతి

ABN , First Publish Date - 2023-09-22T20:47:23+05:30 IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారించేందుకు సీఐడీ (CID) తరపున 12 మందికి అనుమతి ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు (ACB court) తెలిపింది.

ACB court: చంద్రబాబును విచారించేందుకు 12 మందికి అనుమతి

విజయవాడ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారించేందుకు సీఐడీ (CID) తరపున 12 మందికి అనుమతి ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు (ACB court) తెలిపింది. తొమ్మిది మంది విచారణ అధికారులు, ఇద్దరు మధ్యవర్తులు, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారని పేర్కొంది. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, దొమ్మాలపాటి శ్రీనివాస్ పాల్గొనడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి వివరాలను అధికారులు కోర్టుకు అందజేశారు.


స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ప్రతికూల తీర్పు వెలువడింది. ఆయనను రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. 5 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోరినప్పటికీ 2 రోజులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధులు ఎటు మళ్ళించారనే దానిపై విచారించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సీఐడీ తరుపున న్యాయవాదులు విన్నవించారు. దీంతో సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబును రెండు రోజులు పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.


ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు...

చంద్రబాబు విచారణ సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని హెచ్చరించింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-22T20:52:05+05:30 IST