రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ABN , First Publish Date - 2023-04-30T00:17:08+05:30 IST

మండలంలోని తిమ్మాపురం క్రాస్‌ సోలార్‌ ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి బాలుడు ఇ ర్ఫాన(7) మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

పెనుకొండ రూరల్‌; ఏప్రిల్‌ 29: మండలంలోని తిమ్మాపురం క్రాస్‌ సోలార్‌ ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి బాలుడు ఇ ర్ఫాన(7) మృతిచెందాడు. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపి న వివరాలివి. అనంతపురం రాణి నగర్‌కు చెందిన దస్తగిరి ఆటోలో ఫ్రూట్స్‌ అమ్ముకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో దస్తగిరి అనంతపురం నుంచి ఆటోలో దానిమ్మకాయ, ద్రాక్ష పళ్లు వేసుకుని తన ఇ ద్దరు కుమారులు ఇర్ఫాన, ఆరి్‌ఫలతో కలిసి ఆటోలో పెనుకొండ వైపు వస్తున్నారు. పెనుకొండ సమీపంలో దస్తగిరి ఆటో అతివేగంగా నడపడంతో ముందుకూర్చున్న ఇర్ఫాన ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆటోను అతివేగంగా నడపడంవల్లే తన బిడ్డను కోల్పోయినట్లు భార్య ఆయిషా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-04-30T00:17:08+05:30 IST