Home » Puttaparthy
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులుతీస్తోందని, ఇది ఓర్వలేకే మాజీ సీఎం జగన, వైసీపీనాయకులు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి అన్నారు.
కరువు ప్రాంతమైన ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నెరవేరుద్దామని నూతన కమిటీ సభ్యులతో నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు.
గ్రీన ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంతో తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండపోతోందని, రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు.
స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న అధికారి, ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.
జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్తో పరేడ్ మైదానంలో ఎటుచూసినా సందడే సందడి. ఎస్పీ రత్న సైతం పలు క్రీడాంశాల్లో పోటీపడి, ఉత్సాహం నింపారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీల మధ్య పరుగు పందెం నిర్వహించారు.
ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్అండ్బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజ్యసభలో అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్ చేశారు.