చిచ్చు రేపుతున్న వీధుల పేర్ల మార్పు
ABN , First Publish Date - 2023-05-30T23:50:24+05:30 IST
అన్ని మతాలు, కులాలను కలుపుకుపో యే పురమని హిందూపురానికి పేరుంది. ఇక్కడ అన్ని వర్గాలవారు ఏ పండగలు జరిగినా ప్రశాంతంగా జరుపుకుంటారు.
హిందూపురం, మే 30: అన్ని మతాలు, కులాలను కలుపుకుపో యే పురమని హిందూపురానికి పేరుంది. ఇక్కడ అన్ని వర్గాలవారు ఏ పండగలు జరిగినా ప్రశాంతంగా జరుపుకుంటారు. ఒకరి పండగకు మరొకరు వెళ్తూ సంఘీభావం తెలుపుతుంటారు. పట్టణంలో దశాబ్దా ల క్రితం పెట్టిన వీధిపేర్లకు ప్రస్తుతం అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చిచ్చు రేపుతున్నాయి. 15 రోజుల క్రితం ఓ వీధికి పేరు మార్చుతూ మున్సిపల్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే ఈ స మావేశమే ఆగిపోయేలా చేసింది. తాజాగా మరోవీధికి పేరుమార్చు తూ ఎజెండాలో పొందుపరచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పురంలో ఘర్షణలు తలెత్తేలా అధికార పా ర్టీ నాయకులు చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. పట్టణంలోని పలు కా నీల్లో అన్ని మతాలకు చెందిన వీధుల పేర్లు ఉన్నాయి. కొన్నిచోట్ల కు లాలు, వ్యక్తులకు చెందిన వీధుల పేర్లు కూడా ఉన్నాయి. ఎక్కడా ఎ లాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఎందుకంటే కొత్తగా నిర్మాణమవుతున్న కాలనీలు, వీధులకు పేర్లు పెట్టుకోవడంతో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దశాబ్దాల నుంచి ఉన్న వీధులకు పేర్లు మార్చడమే వివాదానికి ఆజ్యంపోసినట్లయ్యింది.
ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత
గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ పాలకవర్గం మున్సిపల్ కొలువులో ఉన్నప్పుడే పేర్ల మార్పునకు శ్రీకారం చుడుతున్నారు. దీనివల్ల కొ న్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు దశాబ్దాల నుం చి ఉన్న వీధులపేర్లు కాదని మార్చడం ఏంటంటూ ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. వారికి అలా పేరు పెట్టుకోవాలని ఉంటే కొత్తగా కాలనీ లు నిర్మింపజేసి, ఎన్ని పేర్లయినా పెట్టుకోని... కానీ దశాబ్దాల క్రితం నుంచి ఉన్న పేర్లను మార్చడం సరికాదని మండిపడుతున్నారు. 15 రో జుల క్రితం ముక్కడిపేటకు మరో పేరు పెట్టాలని ఎజెండాలో అం శాన్ని పొందుపరిచారు. విషయం తెలుసుకుని స్థానికులతో కలిసి బీ జేపీ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. వివాదం ఇంతటితో ఆగిపోతుందనుకుంటే, తాజాగా ఆర్పీజీటీ రోడ్డుకు కొత్తపేరు పెట్టాలని ఎజెండాలో అంశాలను పొందుపరిచారు. దీంతో కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు అదేపని గా రెచ్చగొట్టేందుకు పేర్లు మార్చుతున్నారన్న అపవాదును మూ టగట్టుకుంటున్నారు. నెలలో రెండోసారి కూడా మరోవీధికి పేరు మా ర్చాలని భావించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
పురంలో పేర్ల గోల?
హిందూపురంలో ఒకటి, రెండు సందర్బాల్లో తప్ప మిగిలిన రోజుల్లో కుల మతాలకు అతీతంగా సోదరాభిమానంగా కలిసి మెలిసి ఉంటారు. ఎవరూ ఇక్కడ మతాలు, కులాల విషయంలో ప్రస్తావించరు. కానీ ప ట్టణంలో కొంతమంది వల్ల ఇలాంటి వాతావరణం నెలకొంటోందని అధికశాతం ప్రజలు భావిస్తున్నారు. పట్టణ ప్రజలంతా ఎంతో అన్యోన్యంగా ఉంటే, ఒకరిద్దరి మధ్య ఇలాంటి మార్పులు చేయడం సబబు కాదని, దీనివల్ల కొంతమంది రాజకీయ లబ్ధి పొందాలని, మరికొంతమంది ఆసరా అవుతుందంటూ భావిస్తున్నారు. అసలు పేర్లు మార్చడంవల్ల వచ్చే లాభం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ఘర్షణలకు ఆజ్యం...
పట్టణంలో కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఘర్షణలు తలెత్తాయి. కొంతమంది వ్యక్తులవల్లే అప్పట్లో అలా జరిగింది... తీరా తెలిశాక ఆ ప్రస్తావన గురించి పక్కన పెట్టేశారు. అయితే వీధుల పేర్ల మార్పుతో స్థానికులతో కలిసి కొంతమంది... ఉండాలని, మరికొంతమంది వ ద్దంటూ వెనకుండి నడిపిస్తున్నారు. దీనివల్ల ఎక్కడ ఘర్షణలు తలెత్తుతాయోనని పోలీసులు తలలు బాదుకుంటున్నారు. అసలే ఎన్నికల సం వత్సరం కావడంతో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వీటిని ఓటు బ్యాంకు కోసం వాడుకునే అవకాశం లేకపోలేదంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పేర్ల వెనుక అధికార పార్టీకిచెందిన ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద ఉన్న కొంతమంది వీటిని నడుపుతున్నట్లు పట్టణంలో కోడై కూస్తోంది. ఏది ఏమైనా హిందూపురంలో పేర్ల గోలపై ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. వివాదం ముదురుతున్న నేప థ్యంలో తాజాగా మున్సిపల్ ఎజెండాలో ఈ అంశాన్ని తొలగించేశారు.