ముంచుకొస్తున్న గడువు
ABN , First Publish Date - 2023-05-29T23:27:57+05:30 IST
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రెండో విడత చేపట్టిన నాడు-నేడు అభివృద్ధి పనులు వెక్కిరిస్తున్నాయి. నిర్మాణాల పూర్తికి గడువు ముంచుకొస్తోంది.
పాఠశాలల్లో ముందుకు సాగని నాడు-నేడు పనులు
వచ్చే నెల 10లోపు పనుల పూర్తికి ఆదేశం
నిధులు నిల్.. పనులు ఫుల్
ఒత్తిడిలో ఉపాధ్యాయులు - ఆగిన నిర్మాణాలు
రొద్దం, మే 29: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రెండో విడత చేపట్టిన నాడు-నేడు అభివృద్ధి పనులు వెక్కిరిస్తున్నాయి. నిర్మాణాల పూర్తికి గడువు ముంచుకొస్తోంది. పనులు జూన 10లోపు పూర్తిచేయాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు డెడ్‌లైన విధించా రు. అయితే ఆయా పాఠశాలల్లో కొన్ని రకాల పనులు పునాదులకే పరిమితమయ్యాయి. మరి కొన్నింటిలో రివాల్వింగ్ ఫండ్‌లేక ఉపాధ్యాయు లు తలలు బాదుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం, నిధులు లేక పనులు ఎలా చేయించాలంటూ దీనావస్థలో పడ్డారు. నాడు-నేడు పనులను కొంతమంది ఉపాధ్యాయులు సొంత డబ్బులు పెట్టుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరికొంతమంది సందేహంలో పడ్డారు.
33 పాఠశాలల్లో పనులు
మండలంలోని 33 పాఠశాలల్లో నాడు-నేడు ఫేస్-2 కింద వివిధ ర కాల పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పనుల పూర్తికి డెడ్‌లైన వి ఽధించడంతో ఉపాధ్యాయుల్లో టెన్షన నెలకొంది. జూన రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆపాటికి ఇసుక, మట్టి, కం కర, సిమెంటు వృథాగా ఉండకూడదన్న ఆదేశాలున్నాయి. ఉపాధ్యాయులకు వేసవి సెలవులైనప్పటికీ, నాడు-నేడు పనులు చేపట్టే ఉపాధ్యాయులు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. నిధుల కొరత, సకాలంలో బేల్దార్‌లు, కూలీలు రాకపోవడంతో పనులు కుంటుపడ్డాయి.
పనుల పూర్తిపై సందిగ్ధం
రెండో విడత నాడు-నేడు పనులు మందకొడిగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులు పనులను గాలికి వదిలేశారు. మండలం పనుల్లో పదోస్థానంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆనలైనలో పనులు వేగంగా సాగుతున్నట్లు అప్‌లోడ్ చేశారు. క్షేత్రస్థాయిలో ఎక్కడవేసిన గొంగళి అ క్కడే అన్న చందంగా తయారైంది. సుబ్బరాయప్ప కొట్టాల ప్రాథమిక పాఠశాల, తురకలాపట్నం జిల్లాపరిషత ఉన్నత పాఠశాల, పెద్దగువ్వలపల్లి, దొడగట్ట, చోళేమర్రి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలల్లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. చోళేమర్రి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పనులు గుంతల దశలోనే ఉన్నాయి. పెద్దగువ్వలప ల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పనులు పునాది దశలోనే ఉన్నాయి. నాడు-నేడు పనుల్లో ఆయా పాఠశాలల్లో క్యూరింగ్ సక్రమంగా చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఈపరిస్థితుల్లో గడువులోపు పనుల పూర్తి సందిగ్ధంలో పడింది.