బీసీలకు ప్రత్యేక చట్టం

ABN , First Publish Date - 2023-03-29T00:29:47+05:30 IST

రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసింది, ఆదరించింది టీడీపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పేర్కొన్నారు. పాలసముద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం బీసీలతో ముఖాముఖి నిర్వహించారు.

బీసీలకు ప్రత్యేక చట్టం
బీసీ సదస్సులో మాట్లాడుతున్న నారాలోకేష్‌

వడ్డెర్లకు చట్టసభల్లో అవకాశం

మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత

ముఖాముఖిలో నారా లోకేశ

రొద్దం/పెనుకొండ రూరల్‌, మార్చి 28: రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసింది, ఆదరించింది టీడీపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పేర్కొన్నారు. పాలసముద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం బీసీలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సామాజికవర్గం ప్రజలు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ సమాధానాలు ఇచ్చారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, వడ్డెరలకు చట్ట సభల్లో అవకాశం కల్పిస్తామని అన్నారు. చేనేత కార్మికులకు 500 యూనిట్ల దాకా ఉచిత విద్యుత ఇస్తామని ప్రకటించారు.

ఈడిగ కులస్థులకు మద్యం షాపుల ఏర్పాటులో 30శాతం రిజర్వేషన కల్పించాలి. 45 ఏళ్లు నిండిన వ్యక్తులకు పింఛన ఇవ్వాలి..

- గిరీష్‌ గౌడ్‌, చిన్నమంతూరు

లోకేశ: రాష్ట్రం అప్పుల పాలైంది. ఆర్థిక వనరులను చూసి మెరుగైన సంక్షేమాన్ని అందిస్తాం. కల్లు దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతులు ఇస్తాం.

300 యూనిట్ల విద్యుత వాడితే బియ్యం కార్డు కట్‌ అవుతోంది. చేనేతలకు ఇబ్బందిగా ఉంది.

- కిష్టప్ప, చేనేత కార్మికుడు, సోమందేపల్లి

లోకేశ: పవర్‌లూమ్స్‌ ఉన్న చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత అందిస్తాం. చేతి మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత ఇస్తాం. టాటా కంపెనీ ద్వారా నూతన విధానాన్ని మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అమలు చేశాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.

రాష్ట్రంలో 40 లక్షల మంది వడ్డెర కులస్థులు ఉన్నారు. చట్టసభల్లో అవకాశం కల్పించాలి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను మాకు తిరిగి ఇప్పించాలి.

- నారాయణస్వామి, చిలమత్తూరు

లోకేశ: లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ భూములను టీడీపీ అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీచేస్తాం. చట్ట సభల్లో వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం.

ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇబ్బంది పడుతున్నారు. బీసీ విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుణాలు మంజురు చేస్తారా..?

- గోపీనాథ్‌, పెనుకొండ

లోకేశ: టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్నత విద్య చదివేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. బీసీ రెసిడెన్సియల్‌ పాఠశాలల ను ఏర్పాటు చేస్తాం. దీన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తాం.

వడ్డెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలి, క్వారీలో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించాలి

- శేషాద్రి, వడ్డెర సంఘం

లోకేశ: 1985లో వడ్డెర్లకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు క్వారీలు ఏర్పాటు చేశారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. వడ్డెర్లకు రాజకీయ లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

- ఆదినారాయణ, పాలసముద్రం

లోకేశ: సత్యపాల్‌ నివేదిక ద్వారా గతంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏం చేసింది? ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గాడిదలు కాశాడా..? వాల్మీకులను మభ్యపెట్టి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం ఏమిటి?

గొర్రెలను మేపుకుని జీవనం సాగించే కురుబలకు బీమా కల్పించాలి. మేతకు బంజరు భూములను కేటాయించాలి. గొర్రెల కొనుగోలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. - బే:బీ, హిందూపురం

లోకేశ: చంద్రబాబు నాయుడు కురుబ కార్పొరేషన ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. అధికారంలోకి రాగానే వాటిని పునరుద్ధరిస్తాం. బంజరు భూములను వైసీపీ నాయకులు కాజేశారు. వాటిని తిరిగి లాక్కుని గొర్రెల కాపరులకు అందిస్తాం.

రజకులకు ఆదరణ ద్వారా వాషింగ్‌ మిషన్లు ఇవ్వాలి- నాగరాజు, మడకశిర

లోకేశ: దువ్వాప రామరాజుకు ఎమ్మెల్సీ ఇచ్చాం. రజకులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత ఇస్తాం. వాషింగ్‌ మిషన్లు అందిస్తాం.

Updated Date - 2023-03-29T00:29:47+05:30 IST