ప్రజాసేవలో జవాబుదారీతనం అవసరం
ABN , First Publish Date - 2023-06-15T00:08:53+05:30 IST
ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో అధికారులు జవాబుదారీతనం గా వ్యవహరించాలని కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు.
కలెక్టర్ అరుణ్‌బాబు
పుట్టపర్తిరూరల్, జూన 14: ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో అధికారులు జవాబుదారీతనం గా వ్యవహరించాలని కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన, డీఆర్‌ఓ కొండయ్య, అడిషనల్ ఎస్పీ విష్ణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మధులత హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణం, రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, భూహక్కు, భూరీసర్వే, ఉపాధిహామీ పథకంలో కనీసవేతనం తదితర సేవలను ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్‌రెడ్డి, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, పీఆర్‌ఎ్‌సఈ గోపాల్‌రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ రామకృష్ణ, వార్డు సచివాలయ నోడల్ అధికారి శివారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన, ఏపీఎస్పీ డీసీఎల్ డీఈఈ మోషెస్, పీఆర్ డీఈ మురళి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అంజలి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.