స్పందన అర్జీలను మొదటి ప్రాధాన్యంగా పరిష్కరించండి
ABN , First Publish Date - 2023-06-05T23:56:09+05:30 IST
స్పందనలో వచ్చే పిటీషన్లపై నిర్లక్ష్యం వద్దని, వాటిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం
పుట్టపర్తిరూరల్, జూన 5: స్పందనలో వచ్చే పిటీషన్లపై నిర్లక్ష్యం వద్దని, వాటిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 48 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు స్టేషనలకు ఫోనచేసి సమస్యను వివరించారు. త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిటీషన్లు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. కాగా స్పందన ఫిర్యాదులో అధికంగా కుటుంబకలహాలు, అదనపుకట్నం, భర్త, అత్త, ఆడబిడ్డల వేధింపులు, సైబర్ మోసాలు, రస్తా వివాదాలు ఉన్నాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, దిశ డీఎస్పీ వరప్రసాద్, లీగల్ ఆడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.