అంగనవాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-04-07T00:02:03+05:30 IST
హిందూపురం ఐ సీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
హిందూపురం అర్బన/గోరంట్ల, ఏప్రిల్ 6: హిందూపురం ఐ సీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఈమేరకు గురువారం హిందూపురం సీడీపీఓ రెడ్డిరమణమ్మ, గో రంట్ల సూపర్‌వైజర్ రజిత వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి, వివాహితులై, స్థానికంగా ఉన్నవారు అర్హులన్నారు. 2022 జూలై ఒకటి నాటికి 21 సంవత్సరాలు నిండి, గరిష్ట వయసు 35 సంవత్సరాలు దాటరాదని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 సంవత్సరాలు నిండనివారు లేకపోతే 18 సంవత్సరాలు దాటిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 12న సాయంత్రం 5 గంట ల లోపల హిందూపురంలోని పూటకుంట వద్ద ఉన్న ఐసీడీఎస్ కా ర్యాలయంలో అందజేసి, రసీదు పొందాలని తెలిపారు. రసీదు పొం దిన వారికి మాత్రమే కాల్‌లెటర్ వస్తుందని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ ప్రకారం కార్యకర్త పోస్టుకు ఖాళీ ఉన్న ప్రాంతాలు ఇలా ఉ న్నాయి. గోరంట్ల మండలం కాలేకుంటపల్లి (బీసీ ఏ), భూగానిపల్లి (ఓసీ), అదేవిధంగా ఆయా పోస్టు కోసం ఖాళీలు... హిందూపు రం ఎస్ సడ్లపల్లి-1 (ఓసీ), కంచికామాక్షి-1 (ఓసీ), న్యూహస్నాబా ద్-3 (బీసీ ఇ), ముద్దిరెడ్డిపల్లి-1 (బీసీ బీ), లేపాక్షి మండలంలో నా యనపల్లి (ఓసీ), చోళసముద్రం-1 దృష్టి వికలాంగులు, చిలమత్తూ రు మండలంలో దేమకేతేపల్లి-1 (బీసీ డీ), నేసేవాండ్లపల్లి (ఓసీ), హుసేనాపురం శారీరక వికలాంగులు, పరిగి మండలంలో ఎన ముద్దిరెడ్డిపల్లి (ఓసీ), శాసనకోట-2 (ఎస్టీ), పరిగి మోదా-3 వినికిడి వికలాంగులు, గోరంట్ల మండలం మల్లెల(ఓసీ), బూచేపల్లి (ఎస్సీ), రాగిమాకులపల్లి (ఓసీ)లకు కేటాయించారు. మరిని వివరాలకు సెల్ నెంబర్ 9440814480ను సంప్రదించాలన్నారు.